ఒడిశా లోని కిమోంజర్ జిల్లాలో ఉన్న చిన్న పట్టణం బార్బిల్ లో పుట్టిన భజన గాయని అభిలిప్సా పాండా చిన్నతనానే సంప్రదాయ సంగీతం నేర్చుకుంది. హిందుస్తానీ లో గవర్నర్ ట్రోఫీ గెలుచుకుంది. ఒరియాలోని పట రియార్టీ పొలాలో పాల్గొని ఆదరణ సంపాదించుకున్నది. గాయని గా స్థిర పడుతూనే కరాటే బ్లాక్ బెల్ట్ సాధించింది. యూట్యూబ్ లో రాక్ స్టార్ అభిలిప్సా ఛానల్ నిర్వహిస్తోంది. ఆమె పాడిన ఎన్నో భజన గీతాలు ఆధ్యాత్మిక సౌరభంతో శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ముక్కుకు ముక్కెర చెవులకు జంకీలతో నుదుట కుంకుమ బొట్టు తో గొంతెత్తి బం బం బోలే అంటూ పాడితే భక్తులు పరవశం చెందుతారు.

Leave a comment