బంగారం అందరికి తలిసిందే కానీ బంగారం కంటే ఖరీదైనది మెరుగైనది ప్లాటీనమ్ కి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ వుంది. ఇది వరలో దీన్ని రాజ వంశాలు మాత్రమే ధరించి వంశ పారంపర్యంగా అందించేవి. ఇప్పుడు అందరూ దీన్ని వాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలకీ వన్నె తగ్గదు. విలువ పెరుగుతుందే కానీ తరగదు. మన దేశంలో నగల తయ్యారీ కి వాడే ప్లాటినమ్ 90 శాతం స్వచ్చమైనది. గని నుంచి తవ్వి తీసినప్పుడు ఎంత తెల్లగా స్వచ్చంగా వుంటుందో, అదే రంగు నగలు తయ్యారు చేసినప్పుడు వుంటుంది. మెరుగు పెట్టే పనే లేదు. ఉంగరాలు, బ్రేస్ లెట్స్, మేడలో గొలుసులు షర్ట్స్ కి కఫ్ లంప్స్, గడియారం చెయిన్, నెక్లెస్లు, చెవి ఆభరణాలు, ఉంగరాలు, గాజులు అందుబాటులో వున్నాయి. అతి చిన్న నాగ కూడా 18 వేళ రూపాయిల నుంచి లక్షలాది రూపాయిల వరకు వుంటుంది. బంగారానికి హాల్ మార్క్ వున్నట్లే ప్లాటీనం నగల పైన ‘పి టి 950’ అనే ముద్రలేస్తారు. అది నాణ్యతకు చిహ్నం. ఇటువంటి ముద్ర వేసిన నగల్లో మరే లోపం కలిసే వీలు లేదు.
Categories