Categories
ఉదయపు అల్పాహారం మంచి శక్తిని ఇచ్చేదిగా కొవ్వు తగ్గించేదిగా ఉండాలంటున్నారు డైటీషియన్లు. వాల్నట్ బాదం శరీరానికి శక్తి ఇస్తాయి. కొవ్వు తగ్గిస్తాయి. పెరుగు పాల పదార్ధాలు పండ్లు కలిపి ఎండుఫలాలు వాల్నట్స్ బాదం పలుకులు కలిపి తింటే రోజంతా ఉత్సాహమే. ఓట్స్ ఎంతో మంచివి. బరువు తగ్గటమే కాదు ఆరోగ్యానికీ మంచివే. వెన్న లేని పాలతో తింటే కేలరీలు తగ్గుతాయి. అరటి పండ్లు ముక్కలు. ఎండు ద్రాక్ష పండ్లు నానబెట్టి పొట్టు తీసిన బాదం గింజలు తింటే బలానికి బలం. ఆరోగ్యం రాగి జావ ఎంతో మంచిది. ఇనుము కాల్షియం ఎక్కువ. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తహీనత దూరం అవుతుంది. బెల్లం యాలకులు వెన్న లేని పాలు బాగా మగ్గిన పండ్లు కలిపి తీసుకుంటూ త్వరగా ఆకలివేయకుండా పైగా ఎంతో బలం కూడా.