నేను పుట్టింది పెరిగింది, చదువుకుంది, సంస్కృతిని అర్థం చేసుకుంది లక్నో లోనే.ఆ నగర జీవితపు కథల్ని కలలకు కట్టినట్లు చెప్పగలను అంటోంది జూహీ చతుర్వేది.బాలీవుడ్ అగ్ర సినీ రచయిత విక్కీ డోనర్ పీకూ, గులాబో సితాబో మొదలైన సినిమాలు ఆమెకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టాయి.పీకు లోని అమితాబ్ పాత్ర లో మా నాన్న స్వభావం పూర్తిగా పెట్టేశాను.ఇప్పటికీ మా నాన్న నా పట్ల అంతే పోసిసిక్ గా ఉంటారు.నాకు 40 ఏళ్లు దాటాయి నాన్న నేను స్వయంగా ఆలోచించగలను అన్న వినరు ఒప్పుకోరు ఆ పాత్ర నాకు చాలా ఇష్టం. భావోద్వేగాలను  సృజనాత్మకమైన వ్యంగ్యం…. వాస్తవాన్ని మార్చడం అసాధ్యం అయినప్పుడు ఓ చురుక అంటిస్తే తప్పేముంది అంటోంది జూహీ చతుర్వేది.ఆమె సృష్టించిన పాత్రలు వెండితెరపై కుంచె తో గీసిన చిత్రాల్లా ఉంటాయి.

Leave a comment