ఈ ప్రపంచంలో ఎంతోమంది మనుష్యుల్లో ప్రేమ,దయ నిండి ఉంటుంది . సేలం లో ఉండే ప్రేమ ముగ్గురు బిడ్డల తల్లి  . భర్త ఆత్మహత్య చేసుకొన్నాడు . ఆకలితో ఏడ్చేపిల్లల కోసం ముష్టెత్తిన శుక్రవారం కాబట్టి ఒక్కపైసా కూడా దొరకలేదు . వెంట్రుకలు కొనే మనిషి వెళుతుంటే తన జుట్టు 150 రూపాయిలకు అమ్మేసింది వందరూపాయిలతో పిల్లలకు టిఫిన్ కొనిపెట్టి మిగతా యాభైతో పురుగులమందు కొందామనుకొంది షాపు అతను అనుమానంతో యాభైకి పురుగుల మందు రాదన్నాడు . చివరకి గన్నేరు పప్పు నూరుకొని తిందామనుకొంటే ఆఖరు క్షణంలో అనుకోకుండా చెల్లెలు ఆమె స్నేహితుడితో వచ్చింది . అక్క పరిస్థితి చూసి బోరుమని ఏడ్చింది ఆమె స్నేహితుడు చుసి దీన్ని పేస్ బుక్ లో పెడితే ఎంతోమంది సాయం చేసారు . చివరికు ప్రేమ  నాకు డబ్బులు వద్దు . నేను ఏదో కష్టం చేసి బ్రతుకుతాను అన్నది . ఈ పోస్ట్ సేలం జిల్లా అధికారులకు చేరి ఆమె వితంతు పింఛన్ మంజూరు చేసారు . నేషనల్ ఉమెన్స్ కమిషన్ తమిళనాడు ప్రభుత్వాన్ని దాన్ని గురించి వివరణ కోరింది . శుక్రవారం అయితే మనుష్యులు లక్ష్మి చేజారి పోతుందని ఒక్క రూపాయి ఇవ్వరేమో కానీ కొంతమంది ఆ పట్టింపులు లేవని మెం మనుషులమే ,సాటిమనిషి కోసం నిలబడతాం అని నిరూపించారు .

Leave a comment