Categories
ఎన్నోరకాల వత్తిళ్లకు చక్కని పరిష్కారం స్నానం. గోరువెచ్చని నువ్వులనూనె రాసుకుని ఓ పది నిమిషాలు ఆగి ఓ మాదిరి వేడి నీళ్లలో రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకొని స్నానం చేస్తే ఒత్తిడి మాయమవుతుంది. వీలైతే స్టీమ్ బాత్ మరీ మంచిది. శరీరానికి కొబ్బరి నూనె రాసి కలబంద గుజ్జు తో క్లెన్సింగ్ చేసి తరువాత లావెండర్ బాత్ స్టాల్ కలిపిన నీళ్ళ తో శరీరాన్ని తడుపుతూ మసాజ్ చేసి స్నానం చేయాలి అలసట ఒత్తిడి పోయి చర్మం మెరుపు లీనుతుంది. ఆలీవ్ నూనె వేడి చేసి ఓ స్పూన్ తేనె కలిపి శరీరానికి పట్టించి, పెసర పిండి తో క్లీన్ చేసి గులాబీ రేకులు వేసి మరిగించిన నీటితో స్నానం చేయటంతో ఒత్తిడి తగ్గిపోతుంది.