కఫ్తాన్ నాతో పాటు యాభై మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్లలో 35 మంది మహిళలే. నా కంపెనీ లో కీలక స్థానాల్లో మేనేజర్, అకౌంటెంట్, వర్క్ సూపర్ వైజర్ లుగా మహిళలే పని చేస్తారు. దీన్ని 2011లో స్థాపించాను అంటోంది ప్రకృతి గుప్తా. కఫ్తాన్ అంటే వదులుగా ఉండే చొక్కా టర్కీ ఫ్రాన్స్ లో ఈ పదం వాడుకలో ఉంది. రాత్రివేళ వాడుకునే ఈ డ్రెస్ ను నేను పగలు ధరించే టాప్ గా మార్చాను ఒంటికి తగలగానే ఆహ్లాదంగా ఉండాలి ఆకర్షణీయమైన డ్రస్ లు తయారు చేయటమే కఫ్తాన్ ఉద్దేశ్యం అంటుంది ప్రకృతి. ఎంబీఏ చేసి జాబ్ చేసే దాన్ని. క్యాన్సర్ సోకింది. కీమోథెరపీ తర్వాత ఉద్యోగం చేసే ఉద్దేశం మరచి సొంత వ్యాపారం వైపే రావాలనుకున్న. మా నాన్నసక్సెస్ చేసి ఇచ్చిన ‘క్రాక్‌ హీల్‌’ ఆయింట్‌మెంట్‌ కంపెనీ బాధ్యత కూడా నాదే అంటుంది ప్రకృతి.

Leave a comment