సైన్స్ ఫిక్షన్ ను తెలుగు లో వైజ్ఞానిక కల్పనా సాహిత్యం అనవచ్చు. తెలుగు లో చాలా కొద్ది మంది రచయితలు సైన్స్ ఫిక్షన్ రాశారు. ఒక ప్రక్రియగా విస్తృతంగా ఇది తెలుగులో అభివృధి చెందక పోవటం లోపమే. భారత దేశం వంటి సువిశాల దేశంలో శస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన ఇంకా మూడ విశ్వాసాలు విపక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.సైన్స్ ఫిక్షన్ ఎక్కువగా వస్తే ఈ పరిస్థితి కొంత మారే అవకాశం ఉంది. మధు చిత్తరువ్వ రాసిన z సైన్స్ ఫిక్షన్,మరికొన్ని కథలు రొటీన్ కథలకు చాలా భిన్నమైనవి. ఒక వైపు వైద్య సంబంధిత సమాచారం ఇస్తూ సస్పెన్స్ కలుగజేస్తాయి. మరణించిన జీవచ్ఛవాలు జాంబీలు,వంటివి ఇంత వరకు ఎక్కడ ప్రస్తవనలోకి రాని అంశాలు. ఈ కథల్లో వస్తాయి. రిసెర్చ్ పేరుతొ సమాజాన్ని అల్లకల్లోలం చేసిన అంశాలు,సైన్స్ అభివృద్ధి పక్కదారి పడితే కలిగే భయంకరమైన పరిణామాలు ఈ కథల్లో కనిపిస్తాయి. తప్పని సరిగా చదవవలిసిన కథలు ఇవి.
Categories