పెళ్ళయి అత్త వారింటికి వచ్చిన కొత్తకోడలికి ,ఆ వాతావరణంలో అలవాటు పడేందుకు కాస్త అవకాశం ఇచ్చి,స్నేహంగా మెలిగితే ఆమె అన్ని విధాలా అక్కడ సర్దుకు పోయి సంతోషంగా ఉంటుంది . ఎప్పుడు ఎలాటి సమస్యల రావు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . వచ్చి రాగానే ఆమె పై వంటఇంటి పనులు ,బాధ్యతలు అప్పగించవద్దు . భర్తతో ఆమె సన్నిహితంగా మెలిగే అవకాశం కల్పించాలి ,వారి వైవాహిక జీవితానికి చక్కని పునాది ఏర్పడుతుంది . కోడల్ని ఎప్పుడు పాత తరంతో పోల్చి చేసుకోవద్దని అత్తగార్లకు ప్రత్యేకంగా చెపుతున్నారు ఎక్స్ పర్డ్స్ . ఆధునిక కాలంలో చక్కగా చదువుకొని, కెరీర్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు అమ్మాయిలు కూడా . ఆమెకు అప్పటి వరకు కాలేజ్ చదువు ,తల్లిదండ్రుల గారాబం మాత్రం తెలుసు . ఇప్పుడు ఆమె భర్త తరపు వారితో శాశ్వతంగా జీవించేందుకు వస్తుంది . ఆమెకు ప్రేమపూర్వక మైన ఆహ్వానం పలికి ఆ ఇంట్లో ఆమె స్థానం పదిలంగా ఉంటుందని తెలిసేలా ప్రేమగా ఉండాలి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment