కనుబొమ్మలు వత్తుగా అందంగా ఉండాలంటే బోలెడు ఇంటి చిట్కాలున్నాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .ఆముదం లేదా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ తో కనుబొమ్మల పైన మసాజ్ చేసుకోవాలి .ఉల్లి పాయ రసం రాస్తున్న కనుబొమ్మలు వత్తుగా పెరుగుతాయి .ఉల్లి రసంలో ఉండే సల్ఫర్ రక్త ప్రసరణ మెరుగు పరచి కనుబొమ్మల వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది .కలబంద జెల్ కనుబొమ్మల పై రాసి మర్దనా చేయాలి .గుడ్డు పచ్చ సొన కుడా ఉపయోగమే పాల సంబంధమైన ఉత్పత్తుల్లో ప్రోటీన్లు , విటమిన్లు ఉంటాయి .రాత్రి పడుకొనే  ముందు  పాలలో కాటన్ బాల్ ముంచి కళ్ళ చుట్టూ మసాజ్ చేయాలి . కనుబొమ్మల పైన అప్లయ్ చేయాలి .ఇలా చేస్తే హెయిర్ గ్రోత్ పాస్ట్  గా ఉంటుంది .

Leave a comment