ఫ్యాషన్ ప్రపంచం దేన్నీ వదలదు. డ్రస్సులు, మేకప్, నగలు, ఈ ప్రపంచలో ప్రతి వస్తువు, మార్కెట్ చేయగలిగే ప్రతి అంశం ఫ్యాషన్ వరుసల్లోకి చేరిపోయింది. ఇప్పటి వరకు మే జోళ్ళ పైన ఫ్యాషన్ దృష్టి పడి వుండదు. నల్లవో, గ్రే కలర్వో, తెలుపువో కళ్ళకు కనిపిస్తూ వుంటాయి కదా. ఇప్పుడు వాటి పై కొత్త రంగులు, చెక్కని డిజైన్ల తో మెరుస్తున్నాయి. బూట్లకి ఈ మేజోళ్ళు నప్పుతాయా? ఆడవాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ మోడల్ చెప్పులు ఈ ఫుల్ సాక్స్, యాంకిల్ సాక్స్ బావుంటాయా, అనే సందేహాలు వద్దే వద్దు. అక్షరాలు, నాము మొహాలు, ఆలివ్ గ్రీన్, ఆర్మీ డిజైన్లు, పువ్వులు, ఆకులూ, గీతలు, గళ్ళు, కలిపేసుకుని సరికొత్త స్టాక్ మార్కెట్ లోకి లాంచ్ అయింది. సాక్సేగా అనుకోవద్దు. ఒక వేళఇవే వేసుకున్నా డ్రేస్సుకు మ్యాచ్ అయ్యి పోయి, చీర కుచ్చుల్లకు తగులుతూ బావుంటే మాత్రం ఇక ఆడ పిల్లలకు యాంకిల్ సాక్స్ వాదలనే వదలరు. పిల్లలయితే ఈ పాటికి వీటికి ఓటేసే వుంటారు.

Leave a comment