చర్మ సౌందర్యం కోసం ఎన్నో రకాల ఫేషియల్స్ చేయిస్తుంటారు కాని ఆహారం ద్వారా లభించే పోషకాలు చర్మాన్ని లోపల నుంచి మెరిపిస్తాయి. చలికాలంలో మృదువైన చర్మం మీ సొంతం చేసుకోవాలంటే కొన్ని ఆహారపదార్ధాలు ఎంతో ఉపయోగపడతాయి. అవకాడో ఆరోగ్యవంతమైన నూనెలు విటమిన్- ఇ ఈ రెండు ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇవి చర్మకణాలను సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడుతాయి. బాదం లో ఉండే విటమిన్ -ఇ అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండిన గ్రీన్ టీ ఫ్రీరాడికల్స్ ను తొలగించి చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది. క్యారెట్లలో ఉండే విటమిన్ సి, కొల్లాజెన్ ప్రొటీన్ తయారీకి   ఉపయోగపడుతుంది. పాలకూర అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.

Leave a comment