Categories
పిల్లలను సంతోషపెడితేనే మార్కెట్ అవుతుందని స్నర్క్ కంపెనీ కనిపెట్టింది. ఇప్పుడు పసివాళ్ళకు టీవీ నే లోకం. కామిక్స్ చూడటం నిరంతర వ్యసనమే. ఆ కామిక్స్ లో వచ్చే పాత్రల్లో జీవిస్తూ ఉంటారు.ఈ కోరికలను దృష్టిలో ఉంచుకుని స్నర్క్ కంఫెనీ కొన్ని దుప్పట్లు డిజైన్ చేసింది. దుప్పటి పై చక్కటి రాజకుమారి డ్రస్ మాత్రమే ఉంటుంది. పాపాయి ఆ దుప్పటి కప్పుకుంటే మెడ కింద నుంచి ప్రిన్సెస్ గౌన్ మెరుపులతో వచ్చేస్తుంది. అలాగే నోరు తెరిచిన డైనోసార్ ని కప్పుకుంటే పాపాయి తల డైనోసర్ నోట్లో ఉంటుంది.అంటే దుప్పటి పైన వ్యోమగామి బొమ్మ ఉంటే దాని నెత్తి పైన హెల్మెట్ దుప్పటి పైన ఉంటుంది. ఈ దుప్పట్లు పిల్లలకు బహుమతులుగా ఇచ్చేందుకు చాలా బావున్నాయి.ఆన్ లైన్ లో ఆర్డర్ ఇవ్వచ్చు.