భార్య భర్తల అనుబంధంలో లైంగిక జీవితానిది కీలక పాత్ర . సోషల్ మీడియా ,పని వత్తిడి వంటివి భార్య భర్తల అనుబంధాన్ని దెబ్బ తీస్తున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫోన్ ,టీవిలతో గడుపుతూ ఆస్యంగా నిద్రపోవటం, ఆలస్యంగానే నిద్రలేవటం లాంటివి లైంగిక జీవితంపై అనాసక్తి కలగిస్తున్నాయి .నిద్ర పోయే ముందర నేర సంబంధమైన వార్తలు చూడటం వాటి గురించి ఆలోచించటం వంటివి నష్టమే. నిద్రపోయే ముందు కనీసం గంట ముందైన వీటిని అవతల పెట్ట మంటున్నారు. పడక గదిలో ఫోన్,వాట్సాప్ వంటివి వాడుతుంటే భార్యభర్తల్లో తమను నిర్లక్ష్యం చేస్తున్నా భావన సహాజంగానే కలుగుతోంది. ఇవే దూరాన్ని పెంచుతాయి. సాధ్యమైనంత వరకు వాటిని కట్టి పెట్టటమే చేయాలి. అలాగే పని ఒత్తిడి ,ఆఫీస్ పనిని ఇంటికి తెచ్చుకోవటం ఇద్దరి మధ్య ఒత్తిడి దూరాన్ని పెంచే ఇంకో కారణం అంటారు.ఉద్యోగం ,ఇతర వ్యాపకాల వంటివి కాదు జీవితం ,భార్యభర్తల అనుబంధం అది అపురూపమైనది. నిలుపుకోవలసిన బాధ్యత భార్యభర్తలు ఇద్దరిపై ఉంది.

Leave a comment