నిహారిక, సమస్య అర్ధం అయింది. ఈ పరీక్షల్లో అంత రిజల్ట్స్ చూపెడితేనే రేపు బెటర్ ఫ్యూచర్ వుంటుంది లాంటి మాటలతో పిల్లలను ఎమోషనల్ గా ఒత్తిడి పెడుతున్న మాట నిజమే. ఇంటా బయటా పోటీ ప్రపంచంలో నెగ్గుకు వచ్చేందుకు పిల్లలు ఎన్నో సవాళ్ళు, భయాలు ఎదుర్కొంటున్నారు. తెలిసో తలియకో పిల్లల బావోద్వేగాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఈ సమస్య పూర్తి చేయక పొతే నీకు సినిమా లేదునే చెప్పిన డ్రెస్ వేసుకోక పొతే నీకింక ద్రేస్సులే కొనను, ఇలా ఎమోషనల్ గా మాట్లాడితే పాపం పిల్లలు వింటారు కానీ ఈ ప్రభావం వాళ్ళు పెద్ద అయ్యాక ఇబ్బందులు తెస్తాయంటున్నారుపరిశోధకులు. చీటికి మాటికి బెదిరించడం, పదే పదే సతాయించడం తో పిలల్లో ఒక విధమైన మొండితనం వస్తుంది. ఎవ్వరిని ఖాతరు చెయ్యకపోవడం అలవర్చుకోవాలి. చిన్నతనం లో పెద్దవాల్ల బెదిరింపులకు జడిసి,ప్రతి ఇష్టం లేని పని చచ్చినట్లు చేసిన పిల్లలు మనస్సులో వ్యతిరేకతనే పెంచుకుంటారు. ఇందులో మొదటిగా నష్టపోయేది తల్లి దండ్రులే. పిల్లల్ని మనం ఎలా ప్రోత్సహిస్తమో వాళ్ళు అలాగే స్పందిస్తారు. మన ప్రోత్సాహం వాళ్ళకు మార్గదర్శకత్వం అవుతుంది. మన సతాయింపు ధోరణి వాళ్ళల్లో లోపించే లా చేస్తుంది. పిల్లలకు ప్రేమే ఇవ్వాలి. వాళ్ళని పెంచే క్రమం లో మనం ఇచ్చే విలువైన వస్తువులు కూడా మనం ఇచ్చే ప్రేమా నమ్మకం పిల్లలకు సంతోషం ఇస్తాయి. వాళ్ళకి దగ్గర అవ్వాలి. దారి చూపాలి.
Categories
Nemalika

బెదిరించడం సతాయించడం మానండి

నిహారిక,

సమస్య అర్ధం అయింది. ఈ పరీక్షల్లో అంత రిజల్ట్స్ చూపెడితేనే రేపు బెటర్ ఫ్యూచర్ వుంటుంది లాంటి మాటలతో పిల్లలను ఎమోషనల్ గా ఒత్తిడి పెడుతున్న మాట నిజమే. ఇంటా బయటా పోటీ ప్రపంచంలో నెగ్గుకు వచ్చేందుకు పిల్లలు ఎన్నో సవాళ్ళు, భయాలు ఎదుర్కొంటున్నారు. తెలిసో తలియకో పిల్లల బావోద్వేగాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఈ సమస్య పూర్తి చేయక పొతే నీకు సినిమా లేదునే చెప్పిన డ్రెస్ వేసుకోక పొతే నీకింక ద్రేస్సులే కొనను, ఇలా ఎమోషనల్ గా మాట్లాడితే పాపం పిల్లలు వింటారు కానీ ఈ ప్రభావం వాళ్ళు పెద్ద అయ్యాక ఇబ్బందులు తెస్తాయంటున్నారుపరిశోధకులు. చీటికి మాటికి బెదిరించడం, పదే పదే సతాయించడం తో పిలల్లో ఒక విధమైన మొండితనం వస్తుంది. ఎవ్వరిని ఖాతరు చెయ్యకపోవడం అలవర్చుకోవాలి. చిన్నతనం లో పెద్దవాల్ల బెదిరింపులకు జడిసి,ప్రతి ఇష్టం లేని పని చచ్చినట్లు చేసిన పిల్లలు మనస్సులో వ్యతిరేకతనే పెంచుకుంటారు. ఇందులో మొదటిగా నష్టపోయేది తల్లి దండ్రులే. పిల్లల్ని మనం ఎలా ప్రోత్సహిస్తమో వాళ్ళు అలాగే స్పందిస్తారు. మన ప్రోత్సాహం వాళ్ళకు మార్గదర్శకత్వం అవుతుంది. మన సతాయింపు ధోరణి వాళ్ళల్లో లోపించే లా చేస్తుంది. పిల్లలకు ప్రేమే ఇవ్వాలి. వాళ్ళని పెంచే క్రమం లో మనం ఇచ్చే విలువైన వస్తువులు కూడా మనం ఇచ్చే ప్రేమా నమ్మకం పిల్లలకు సంతోషం ఇస్తాయి. వాళ్ళకి దగ్గర అవ్వాలి. దారి చూపాలి.

Leave a comment