Categories
ఖాళీ సమయంలో ఎదో ఇష్టమైన హాబీతో గడపండి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు . శారీరక సామర్థ్యం ఉపయోగించే క్రీడలు హాబీగా ఉన్నవాళ్ళు లో మల్టీ టాస్కింగ్ సామర్థ్యం 15 శాతం ,ఉత్పత్తి సామర్థ్యం 23 శాతం పెరుగుతుందట . వంటపని మెదడు సామర్ధ్యాన్ని పెంచుతుంది . కంప్యూటర్ నైపుణ్యం మెదడుని చురుగ్గా మార్చుతుంది . వేగంగా వీడియో గేమ్స్ ఆడపిల్లల్లో నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుంది . కుట్లు అల్లికలు ఇష్టం అయిన వాళ్ళలో జ్ఞాపక శక్తి సమస్యలు రావు . కొత్త భాషలు నేర్చుకొంటూ ఉంటే అల్జీమర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి . వృత్తి ఉద్యోగాలకు భిన్నమైన హాబీలను పెంపొందించుకొంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయని ఒత్తిడి నుంచి నిముషంలో తేరుకుంటారని అధ్యయన కారులు చెపుతున్నారు .