Categories
కాస్ట్యూమ్ డిజైనర్ గా సినీ రంగంలో తనదైన ఒక ప్రత్యేకత నిలబెట్టుకొని ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న తొలి మహిళ గా నిలబడింది భాను అథియా. 1950లో గురుదత్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించింది భాను అథియా. ప్యాసా, గైడ్, వక్త్, మేరే నామ్ జోకర్ వంటి వంద సినిమాలకు డిజైనర్ గా పని చేసింది. రిచర్డ్ అటెన్‌బరో గాంధీ సినిమాలో భారతీయ పాత్రల కాస్ట్యూమ్స్ ఆమె చేత డిజైన్ చేయించారు. 1991లో 2002లో, సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు అందుకుంది. నాగరిక్ ఆమె చేసిన చివరి సినిమా 2020 అక్టోబర్ 15 న కన్నుమూసింది భాను అథియా.