Categories
పిల్లల చేత ఏ పని చేయించటం అయినా కష్టమే. కనీసం భోజనం కూడా పేచీలు లేకుండా చేయరు. వాళ్ళని లొంగదీసేందుకు ఏదో బూచి భయన్ని వాడుతుంటారు పెద్దవాళ్ళు. కానీ ఇలాంటి భయాలు పెద్దవుతున్నా కొద్దీ వారి మానసిక స్థితిపై ప్రభావం చూపెడుతుందంటారు ఎక్స్ ఫర్ట్స్.వాళ్ళలో క్రమ శిక్షణ మాట అటుంచి ఎదిగే కొద్దీ వాళ్ళలో భయం పెరిగి ఆత్మవిశ్వాసం సన్నగిల్లి పోతుంది. ఏ పని సొంతంగా చెయలేని పరికి ధోరిణి ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. సృజనాత్మాక శక్తి లోపిస్తుంది.ఇలాంటివి దృష్టిలో పెట్టుకోని పిల్లల్ని భయపెట్టటం కంటే వాళ్ళకి విషయాలు వివరిస్తూ ఒప్పిస్తూ పనులు చేయించండి అంటున్నారు నిపుణులు.