ఏ పని అయినా నలుగురి సహకారం అవసరం. ఒంటరిగా ఏమి చేయలేం. ప్రస్తుతం మనం ఉంటున్న సమాజం పరిస్థితి నిష్టూరంగా అనిపించినా అలానే ఉంది అంటుంది స్లమ్ డాగ్ మిలియనియర్ లో నటించిన ఫ్రీదా పింటో. కాస్టింగ్ కౌచ్ పేరుతో హాలీవుడ్ లో తొలిసారిగా మీటూ పేరుతో క్యాపెయిన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేదింపులకు గురైన ఎంతో మంది తమ గళం విప్పి అనుభవాలు పంచుకున్నారు. కాని ఇండియాలో ఆ పరిస్థితి లేదు అంటుంది ఫ్రీదా ప్రింటో. ఇటివల జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిడ ఈ విషయం గురించి మాటాడుతూ బయటకు వచ్చిమాట్లాడితే ఎక్కడ ఐడెంటిటి పోతుందో అన్న భయంతో కొందరు బయటకి రారు.ఒకళ్ళు పోరాడుతుంటే వారికి ఇతరుల సహాయం లభించదు. గట్టిగా తిరుగుబాటు చేసే ధైర్యం భవిష్యత్ లో అయినా వస్తే బావుండు అంటుంది ఫ్రిదా పింటో.
Categories