తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్ళెప్పుడు మనకు బీబీ నాంచారమ్మ కూడా దర్శనం ఇస్తుంది.ఈమె స్వామి వారికి రెండవ భార్య.
మధ్య శదాబ్దంలో మహమ్మదీయ పరిపాలనలో వైష్ణవాలయాల ధ్వసం కారణాల నిమిత్తం వెంకన్న విగ్రహాన్ని దాచటం జరిగినప్పుడు ముస్లిం యువతి అయిన బీబీకి విగ్రహం చూసి ప్రేమించి స్వామిలో ఐక్యం అయింది.బీబీ అనే పదం ముస్లిం పదం నాంచారి అనేది తమిళ పదం అని పురాణ గాథలు చెబుతున్నాయి.స్వామి వారి విగ్రహం శ్రీ రంగనాథస్వామియే అని భక్తుల నమ్మకం.
కడప జిల్లాలో ఉన్న వేంకటేశ్వర ఆలయానికి ముస్లింలు కూడా దర్శనానికి తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.బీబీ నాంచారమ్మ కనకదుర్గమ్మకి ఆడపడుచుగా పూజలు చేసి ముక్తి పొందుతారు భక్తులు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర.

– తోలేటి వెంకట శిరీష

Leave a comment