బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు పాలిచ్చేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఉండాలని తన తొమ్మిది నెలల కొడుకు అయినా అవ్యన్ పేరుపైన కోర్ట్ లో పిల్ దాఖలు చేసింది. ఢిల్లీ వాసి న్యాయవాది నేహా రస్తోగి. ఫ్లైట్ లో తన బిడ్డకు ప్రశాంతంగా పాలిచ్చే వీలు దొరకగా పోవటంతో నేహా రస్తోగి ఈ అంశంపై పోరాటం మొదలు పెట్టింది.ఆమె వేసిన కేస్ తోనే ప్రభుత్వం ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లోని ప్లేస్ లో పార్లమెంట్ స్ట్రీట్ లో మొదటి ఫీడింగ్ రూమ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఆ తర్వాత ఢిల్లీ ఎఫ్ సి.ఆర్ లో 700 లకు పైగా పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.

Leave a comment