Categories
అంజలి ఖన్నా పుదుచ్చేరి లోని గోల్డెన్ బ్రిడ్జ్ లో సిరామిక్ కుండల తయారీ నేర్చుకున్నారు. ముంబై లోని ఆలీ బాగ్ లో ఆమె సిరామిక్ స్టూడియో ఏర్పాటు చేశారు. దేశంలోనే కాదు విదేశాల్లోనూ పాటరి ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ మధ్యకాలంలో ఆమె ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సిరామిక్స్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో ఈ సిరామిక్ కళారూపాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.