ఫేస్ ప్యాక్ వేసుకునేందుకు కాస్త సమయం తీసుకోంటు వుంటుంది. ఇవి నిపుణులైన బ్యూటీ ఎక్స్ పర్ట్స్ వేస్తేనే ఫలితం బావుంటుంది .ఇప్పుడు సౌందర్య పరి రక్షణ కోసం ఫేస్ మాస్క్ లు వచ్చాయి. ఈ షీట్ లు ముఖానికి సరిపోయే కొలతలతో దొరుకుతాయి. పాలిథిన్ లేదా ఫైబర్ షీట్లు ఇందుకోసం వాడతారు. వీటిని కిర, దానిమ్మ, బొప్పాయి, బత్తాయి వంటి పండ్ల రసాల తో ముంచుతారు కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తులు వీటిపై పూతలా వేస్తారు. ప్యాకింగ్ లోంచి తీసి వీటిని మొహం పై వేసుకొని ఇరవై నిముషాల తర్వాత తీసివేస్తే చాలు. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఒకప్పుడు జపాన్,దక్షణ కొరియాల్లో దొరికే షీట్ మాస్క్ లు ఇపుడు ప్రపంచం మొత్తం దొరుకుతున్నాయి.

Leave a comment