నేరుగా తినే కీరా దోస, కూరగాయలా వాడుకునే దోసకాయ రెండింటి రూపం లో తేడా కనిపిస్తుంది కానీ ఈ రెండింటి ది ఒకటే జాతి కీరా ప్రపంచవ్యాప్తంగా ఉండే దోస మన దగ్గరే పండుతుంది రెండింటిలో పోషకాలు ఒక్కటే ఆరోగ్యానికి మేలు చేసేవే వేసవిలో కీర ముక్కలు పుదీనా కలిపి మిక్సీలో వేసి జ్యూస్ లా చేసుకుని తాగితే డిహైడ్రేషన్ రాదు కీరా లో పుష్కలంగా ఉండే క్యాల్షియం విటమిన్ కె శరీరంలో త్వరగా ఇంకటం వల్ల ఎముకల సమస్యలు రావు. కీర,దోస ఇవి రెండు చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి. వీటిల్లోని రుటిన్ ఆస్కార్బిస్ ఆక్సి డేజ్ అనే పదార్థాలు ప్రీ రాడికల్స్ ని అడ్డుకుంటాయి. సన్ స్క్రీన్, ఐ టోనర్లు లోషన్లల్లో వీటిని వాడతారు కీరా గుజ్జులాగా చేసి  టోనర్ లాగా వాడితే మచ్చలు తగ్గి మొహం కాంతివంతం అవుతుంది.

Leave a comment