Categories
ఆరతి సాహా 1959 లో ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి ఆసియన్ మహిళగా రికార్డ్ ల కెక్కారు. ఫ్రెంచ్ నుంచి ఇంగ్లాండ్ కు 16 గంటల 20 నిమిషాల్లో ఈది ఈ ఘనత సాధించారు. 1960 లో ఆమెను పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఆరతి సాహా గౌరవార్థం 1999 లో పోస్టల్ డిపార్ట్ మెంట్ స్టాంప్ విడుదల చేస్తే గూగుల్ సంస్థ ఈమె 80వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్ నే క్రియేట్ చేసింది. 1996లో ఆరతి సాహా నివాసానికి సమీపంలో ఆమె ప్రతిమ ను నిర్మించారు.