Categories
WoW

ఒక అద్భుత పానీయం నీరు.

జీవనానికి నీరే మూలం. మన శరీరాన్ని కదలించే కండరాళ్ళ లో 75 శాతం నీరే.  మెదడులో ఎక్కువ శాతం నీరే వుండటంతో నీరు తాగడం వల్ల ఆలోచన మెరుగవ్వుతుంది. శరీరంలో కొవ్వుతో పాటు పుట్టే పదార్ధాలు తొలగించి బరువు తగ్గించేది నీరే. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపి ముత్రపిండాల్లో రాళ్ళు, ముత్ర నాళ ఇన్ఫెక్షన్లు కాకుండా అడ్డుకుంటుంది. చర్మాన్ని తాజాగా మెరిసేటట్లు పొడిబారకుండా ఉండేటట్లు చేస్తుంది. శరీరం చక్కగా పనిచేస్తున్నప్పుడు, దానికి అవసరమైన నీరు అందితేనే మనకు అంతా బావున్నట్టు అనిపిస్తుంది. మన శరీరంలో శ్వాశ ద్వారా రెండు మూడు లీటర్లు నీరు పోగొట్టుకుంటుంది. అనారోగ్యంగా వున్న, అతిగా వ్యయామం చేసినా గర్భం ధరించినా ఇంకా ఎక్కువ నీరు అవసర పడుతుంది. రోజుకు 2.2 లీటర్లు అంటే తొమ్మిది  కప్పుల నీరు అవసరంగా తాగాలి. స్స్వచ్చమైన నీరు అది కొళాయినీరైనా, బాటిల్లో వున్నా సరే, చక్కరే ఎక్కువగా వున్న పండ్ల రసం కంటే మాములు నీళ్ళు శరీరానికి ఎంతో ఉపయోగం , అవసరం కూడా.

Leave a comment