టెక్నాలజీ మారుతుంది. మనుష్యూల అవసరాలు మారుతున్నాయి. తిండి వేళలు, పద్దతులు మారిపోతున్నాయి. కొత్త వ్యాపారాలు కొత్త ఐడియాలతో వచ్చి కోట్ల లాభం కురిపిస్తున్నాయి.శిఖర్ సింగ్, నిధి సింగ్ బయోటెక్నాలజీ చదివి ఉద్యోగాలు సంపాదించి పెళ్ళాడి బెంగళూరులో స్థిరపడ్డారు. వాళ్ళకి బిజినెస్ ఇష్టం ఉద్యోగాలు మానేసి ఉన్న అపార్ట్ మెంట్ కాస్త అమ్మేసి ఆ డబ్బుతో వాళ్ళు అప్పటివరకు పరిశోధనలు చేసిన సమోసాల వ్యాపారం మొదలు పెట్టారు. కొవ్వు,క్యాలరీలు తక్కువగా ఉండే వీళ్ళ ‘సమోసా కింగ్’ కంపెనీ సమోసాలు బ్రహ్మాండమైన ఆర్డర్లతో బెంగళూరు, హైదరాబాద్ లో విజయవంతంగా నడుస్తున్నాయి. చక్కని స్టార్టప్ కోసం ఆలోచించేందుకు వీళ్ళ కథ స్పూర్తిగా ఉంది కదా.