యువర్ అటెన్షన్ ప్లీజ్ ..దయచేసి వినండి.. ట్రైన్ నంబర్ ..కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లవలిసిన శాతవాహన ఎక్సప్రెస్ ఇలాంటి అనౌన్స్మెంట్స్  రైల్వే స్టేషన్ లో వింటూ ఉంటాం. ఈ గొంతు సరళా చౌదరిది. 1982 లో ముంబై లోని సెంట్రల్ రైల్వే ఉద్యోగం కోసం ప్రకటన ఇస్తే అందులో సరళా చౌదరి కూడా ఉన్నారు. అప్పట్లో కంప్యూటర్స్ లేవు. సరళా  చౌదరి ప్రతి ప్రకటననూ చదివి వినిపించేవాళ్ళు. తర్వాత టి. ఎం. ఎస్ వచ్చాక కొన్ని వేల  అనౌన్స్మెంట్స్ సరళా చౌదరి తన గొంతుతో రికార్డ్ చేస్తే రైల్వే అధికారులు టి.ఎం.ఎస్ కు అనుసంధానించి ఆటోమేటిక్ అనౌన్స్ మెంట్ వచ్చేలా ఏర్పాటు చేసారు. సరళా చౌదరి ఇప్పుడు రిటైర్ అయ్యారు. కానీ ఎప్పుడైనా స్టేషన్ కు వెళితే తన గొంతు తానే  వింటానని చెప్తారు.

Leave a comment