సాధారణంగా స్నానాల గదుల్లో లూఫా లుంటాయి. దీన్ని  వాడేసి అలా పక్కన పడేస్తే బాక్టీరియా చేరిపోయి అనవసరమైన ఇన్ఫెక్షన్లు వస్తాయంటున్నారు  డాక్టర్లు. తడిగా వుంచకుండా  వాడాక శుభ్రంగా కడిగేసి ఎండలో వుంచండి అంటున్నారు. ప్రతి మూడు నెలకొకసారి తప్పనిసరిగా లూఫా  మార్చాలి. వేడినీళ్లలో నిమ్మగడ్డ నూనె ,కొబ్బరి నూనె వేసి అందులో లూఫా  ని వుంచితే  తేలిగ్గా ఫంగస్ సూక్ష్మ జీవులు పోతాయి. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్  గుణాలు అధికంగా ఉంటాయి. బ్లీచింగ్ వేసిన నీళ్లలో కడిగి పొడి బట్టలు చుట్టి ఎండలో పెట్టి వాడుకోవటం మంచిది.

Leave a comment