విసిరి పడేసిన మొలుచుకొచ్చి అద్భుతమైన గంజిల్లాంటి అమ్మాయిలు. వీళ్ళకు ఎవళ్ళతో పోలిక లేదు. వీళ్ళకు వీళ్ళు సాటి. ముంబాయి నగరంలో కామాఠీప్పర లోని చీకటి వీధిలో పుట్టి పెరిగింది శ్వేతా కట్టి. తన లాంటి వాళ్ళ జీవితాలకు చదువే వెలుగనుకుంది. స్వచ్చంద సంస్థ అప్నేఆప్ పాఠశాలలోచదువుకుంది. క్రాంతి అనే ఇంకో సంస్థ అమెరికా వెళ్ళి చదువుకుంటుంది. ఉన్నత చదువులు చదివి తిరిగి వచ్చి కామాఠీపుర లో కౌన్సెలింగ్ సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడి అమ్మాయిలు వృత్తి వైపు వెళ్ళకుండా మార్పు తీసుకు రావడం ఆమె లక్ష్యం పేరు, అవార్డు వెతుక్కుంటూ వస్తున్నాయి. ది ఇండస్ ఎంట్రప్రెన్యుర్స్ నిర్వహించిన టై గ్లోబల్ సమ్మిట్ 2016 లో యంగ్ అఛివర్సి అవార్డుకు ఎంపిక అయింది.

Leave a comment