పెద్దవాళ్ళు ఎప్పుడు భార్యభర్తలను అవసరమైన వాదనల జోలికి పోకుండా సర్దుకు పోమనే చెపుతారు. చాలా ఇళ్ళలో ఎవరో ఒకళ్ళు మౌనంగా ఉరుకొని ఇల్లు శాంతంగా ఉంటే చాలు అనుకొంటారు. కానీ ఇదే పొరపాటు వాదనలే లేకపోతే విషయాలు ఏక పక్షంగా అయిపోతాయి. ఇంకా సంసార సంబంధమైన ఏ పనిలోనూ మెరుగుదల ఉండదు. అదే చర్చలు ,వాదనలు జరిగితే ఒకళ్ళు అభిప్రాయం ఒకళ్ళకి సరిగ్గా చేరుతోంది. కుటుంబ సంబంధమైన విషయాలు ఒకటికి రెండూ సార్లు ఆలోచించుకొంటారు. అంచేత వాదనలు కాస్త మంచివే అలాగని చిన్న విషయాలకు వాదనలు పెంచితే మన శ్శాంతి పారిపోతుంది.

Leave a comment