Categories
కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకీ మనసు వెళ్ళకూడదు అంటారు. చూసిన ప్రతిదాన్ని ఆశించకుండా మనసుకి శిక్షణ ఇవ్వలంటారు ఎక్స్ పర్ట్స్ . మనకు నచ్చేవే కళ్ళకు ఆకర్షిణీయంగా ఉండాలి. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవటం ,మనల్ని మనం తక్కువ చేసుకొనే ఆలోచన ఉండటం బదులు, మంచి విషయాలు ,మన ప్రతిభను పెంచుకోవటంపై దృష్టి పెడితే మంచిది అంటున్నారు . మనల్ని చూసి మనమే స్ఫూర్తి పొందాలి అంటున్నారు . అప్పుడు అద్దంలో చూసుకొంటూ మన స్ఫూర్తి గత పరిధిలోకి వచ్చే మంచి విషయాల గురించి మనతో మనం సంభాషించాలట. మనం చిన్న సక్సెస్ సాధించిన ,ఒక చిన్న మంచి పని చేసిన మనకు మనమే శభాష్ అనుకొని ఒక చిరునవ్వు బహుమతిగా ఇచ్కుకోవాలి. అంటే స్ఫూర్తి మనకు మనలోంచే రావాలి.