ఎవరో రాస్తే ఎవరో డిజైన్ చేస్తే ఇంకేవరో మేకప్ చేస్తే సినిమా నటులు సెలబ్రిటీ హోదాలో చాలా సుఖంగా ఉంటారని భావిస్తారు ,కానీ కోట్ల మందిని మెప్పించటం అనుకొన్నంత తేలిక కానేకాదు. వాళ్ళు ఎన్ని నైపుణ్యాలు ప్రతి నిమిషం నేర్చుకొంటారో . భాషని నటననీ మెరుగు దిద్దుకొంటారు, ఉదహారణకు సల్మాన్ ఖాన్ ,కత్రీన కైఫ్ లతో కలసి నటిస్తున్న నోరా తేహీ తన సపోర్టింగ్ రోల్ కోసం స్పానిష్ భాషను కష్టపడి నేర్చుకుందట . సినిమాలో లాటిన్ గా నటిస్తున్నాందుకు స్పానిష్ పదాలు నేర్చుకొని పాత్రకు న్యాయం చేస్త్తా నంటోంది. ఓ మంచి ఫ్రెండ్ దగ్గర ప్రాధమిక స్పానిష్ పదాలు నేర్చుకొంటున్నాను. స్పానిష్ యాసలో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్చుకొంటున్నాను. రోజువారి వాడే కొన్ని స్పానిష్ పదాలు నామాటాల్లో చేర్చుకొని అలవాటు చేసుకొంటున్న అంటోంది నోరా తేహీ.

Leave a comment