Categories
Gagana

మిసెస్ ఇండియా ఫెనల్స్ లో శ్వేతా రావూరి.

హాట్ మోంద్ నిర్వహించిన 2017 మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలలో శ్వేతా రావూరి ఫైనల్ రౌండ్ కు ఎంపికయ్యారు. ఈమె టాలీవుడ్ నటుడు అజయ్ భార్య, ఇద్దరు పిల్లల తల్లి, పెళ్లి అయ్యాక, ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇస్తూ శ్వేతా రావూరి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఫేస్బుక్ లో జిమ్ లో వ్యాయామం చేస్తున్న వీడియో ను పోస్ట్ చేసారు శ్వేతా రావూరి. మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ కు సిద్దమౌతున్నట్లు హ్యాష్ ట్యాగ్ జతచేసారు. ఆమె పోటీలో ఎంపికైన విషయాన్ని అజయ్ ఫేస్ బుక్ ద్వారా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేసారు. తన భార్య చివరి రౌండ్ కు ఎంపిక కావడం సంతోషంగా గర్వంగా ఉందన్నారు.

Leave a comment