యువతరం మెచ్చే ఫ్యాషన్స్ నిముష నిమిషం మారిపోతాయి. కానీ ఫ్యాషన్ కోసం కొన్ని కొన్ని రకాల వస్త్రాలు అలా మిగిలిపోతాయి. ఇప్పుడు మెడ చుట్టూ ధరించేందుకు ఎన్నో రకాల రంగుల డిజైన్ల స్కార్ఫ్ లు కొంటుంటారు. ఒకే రకంగా ధరించాలి అంటే బోర్ అని పక్కన పడేస్తారు. క్రియేటివ్ గా ధరించే దుస్తులను బట్టి స్కార్ఫలు వాడుకోవాలి. వాటిని పొనీ టైల్ బిగించేందుకు వాడుకోవచ్చు. పొడవాటి షిఫాన్ స్కార్ఫ్ సర్ట్ లేదా, ఫెమినైన్ షార్ట్స్ పై చక్కని బెల్ట్ గా ఉపయోగ పడుతుంది. దీన్ని బెల్ట్ లూప్స్ దాకా దానిచ్చి ఒక పక్క నీట్ గా ట్రై చేస్తే చాలా అందంగా ఉంటుంది. స్కార్ఫ్ యాక్ససరీస్ కు సైతం ఎంతో అదనపు అందం ఇస్తుంది. టాటో లేదా మెసెంజర్ బ్యాగ్ హండిల్ కు ముడివేయవచ్చు. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు ఇలాంటిదే ఇంకాస్త  సృజనాత్మకంగా కళాత్మక ద్రుష్టిలో అలోచించి వీటిని ఉపయోగించుకోవచ్చు.

Leave a comment