అదేమిటో మండే ఎండల్లోనే పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది. కాలు బయట పెడితే ఎండ, ఉక్క. కానీ పెళ్ళికొ, పేరంటానికో వెళ్ళాలి. ఇక పట్టు, డిజైనర్ వేర్, వంటి పైన పెట్టాలంటే ఎంతో ఇబ్బంది కనుక ఈ కాలంలో ఏ ఫంక్షన్ కు పోయినా కాటన్ కట్టుకునేందుకుఇష్ట పడతారు అందరు. మరి సాదా కాటన్స్ గ్రాండ్ లుక్ ఇస్తాయా అంటే వెంటనే ఎస్ అంటున్నారు. డిజైనర్ సిల్క్ ని మించిన డిజైన్స్ ఇప్పుడు కాటన్ లోనూ కనువిందు చేస్తున్నాయి. పైగా సౌకర్యం, అందం, సింపుల్ ఇంకా ఎన్నో సుగుణాలున్న పార్టీ వేర్ కాటన్ శారీస్ ను ఆన్ లైన్ లో చుస్తే ఇంకా ఏ వేదిక కైనా ఇవే కావాలనుకుంటారు. మంచి రంగులు, డిజైన్లతో పార్టీ వేర్ కాటన్స్ ఇప్పుడు, ఫ్యాషన్స్ వరుసలో ఫస్ట్ మార్క్ కొట్టేస్తాయి. ఠోని, హుందా తనం ఉట్టి పడేలా ఉన్నాయి. ఈ కాటన్ డిజైనర్ శారీస్.

Leave a comment