వేసవి వచ్చిందంటే మొత్తం జీవన శైలి మారిపోతుంది. దుస్తులు, మేకప్, తినే ఆహారం అన్నింటినీ మార్చేయవలసి వస్తుంది. అలాగే పాదాల పై కూడా ఎంతో శ్రద్ధ కావాలి. ఈ సీజన్లో పాదాల్లో స్వేదం ఎక్కువగా వుంటుంది. దీనితో జిడ్డు మురికి పేరుకు పోతాయి. పడుకునే ముందు పాదాలు చల్లని నీటితో కడుక్కుని ఎదో ఒక ఫుట్ క్రీమ్ లేదా లోషన్ ప్రతి రోజు అప్లయ్ చేయాలి. అయితే వేళ్ళ నడుమ అతిగా క్రీమ్ రాయకూడదు. దీని వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చె అవకాశం వుంది. పదాన్ని కవర్ చేయకుండావదిలేయాలి అనికున్నప్పుడుమాత్రమే సన్ స్క్రీన్ అప్లయ్ చేయాలి. సౌకర్యవంతమైన బాగా గాలి అడేలా వుండే షూ ఎంపిక చేసుకోవాలి. రాత్రి వేళ కళ్ళకు కొబ్బరి నూనె అప్లయ్ చేసి కాటన్ సాక్స్ వేసుకుని పడుకుంటే పాదాలు డ్రై అవ్వకుండా ఉంటాయి. అలాగే పాదాలు పగుళ్ళు వుంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి.

Leave a comment