పిల్లలకి బొమ్మలకు మంచి అనుబంధం ఉంటుంది. అపురూపంగా చూసుకునే ఏ బార్బీ డాల్ కన్నో కాలో ఉడిపోతే వాళ్ళ దుఖం చెప్పనలివి కాదు. ఇంకోటి కొత్తది కోనిస్తా అన్నా అప్పటి వరకు చేతిలో ఉన్న పాత బొమ్మ పట్ల మమకారం పోదు. ఇదిగో ఇలాంటి పిల్లలకోసం డాల్ హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా పోర్చుగల్ లో 1830లో ఏర్పాటైన బొమ్మల హాస్పిటల్లో ఏళ్ళ తరబడి సేవలు అందిస్తున్నాయి. ఈ ఆస్పత్రి వాతావరణం విచిత్రంగా ఉంటుంది. బొమ్మలకు సంభందించిన కొన్ని వందల బాడి పార్ట్ లు అక్కడ పడి ఉంటాయి. అన్ని శారీరక భాగాలు పడి ఉంటాయి గనుక పాడైపోయిన బొమ్మలను ఇక్కడ డాక్టర్లు రిపేర్ చేసి విరిగిపోయిన బొమ్మను కొత్తగా చేసి ఇస్తారు. పిల్లలకు ఇష్టమైన ఈ హాస్పిటల్ గురించి వారిని తెలుసుకోనివ్వండి.