మానవుల నుదుటి రాత రాసేది ఆ బ్రహ్మగారే కదా!! ఆయనగారు మరి తన కూతురునే వివాహమాడాడు.శివుని శాపం వల్ల బ్రహ్మకి ఎక్కువ ఆలయాలు,పూజలు ఉండవు. సరస్వతీ పురాణంలో బ్రహ్మ సరస్వతి,సంధ్య,బ్రాహ్మి అని ముగ్గురుని తన తపశ్శక్తితో సృష్టించాడు.వీరిలో సరస్వతి అపురూప సౌందర్యవతి కావున ఆమెను పెండ్లాడి మానవులను సృష్టించాలని సంకల్పించాడు. సరస్వతీ దేవి తన కనుసన్నల్లోనే వుండాలని తన నాలుగు తలలతో ఎల్లప్పుడూ దృష్టి పెట్టేవాడు.చివరికి సరస్వతీ దేవిని వివాహం చేసుకుని వంద సంవత్సరాలు ఏకాంతంలో వుండి మను అనే మానవునకు జన్మనిచ్చి సృష్టిని ప్రారంభం చేశారు.

నిత్యప్రసాదం:కొబ్బరి

-తోలేటి వెంకట శిరీష

Leave a comment