తెలిసో తెలియకో బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ చేస్తుంటారు చాలా మంది ఆడవాళ్లు అడిగితే తీరిక లేదంటారు. కానీ ఉదయాన్నే చేయవలిసిన బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సుమారు 27 వేల మందిపైన సుదీర్ఘ కాలం పరిశోధనలు నిర్వహించారు. రెండు గ్రూపులుగా వీరిని విభజించి ఒక గ్రూపుకి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వకుండా రెండవ గ్రూపుకి ఇచ్చి కనీసం ఒక సంవత్సరం పరిశోధన చేస్తే అల్పాహారం తీసుకొనేవారు అధిక బరువు పెరిగినట్లు వారిలో ఒత్తిడి గమనించారని ఈ రెండు సమస్యలే గుండెకి సంబంధించిన ఎన్నో సమస్యలని తీరుస్తాయని పరిశోధకులు రిపోర్ట్ ఇచ్చారు ఉదయం తీసుకునే అల్పాహారానికి ,గుండె పని తీరుకీ మధ్య సంబంధం ఉందని వీరు కనిపెట్టారు. పొద్దుటే పనివేళ అని పది చేతులతో పని చేస్తున్నా తరగటం లేదని ఏ కాఫీ తోనో సరిపెట్టుకునే ఇల్లాళ్లకు ఇది హెచ్చరిక.
Categories