ఆన్ లైన్ లో పశువుల సంత ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఢిల్లీ ఐ.ఐ.టీ  చదివిన నీతు యాదవ్ కీర్తి జంగ్రా Animall యాప్ ద్వారా ఈ ఇద్దరు ఇప్పటికే యాభై వేల పశువుల అమ్మకాలు చేశారు. 2019 లో బెంగుళూరు లో యానిమల్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇంత చదువు చదివి ఆన్ లైన్ లో పశువుల అమ్మటం ఏమిటని కామెంట్స్ వచ్చాయి. కానీ 2021 నాటికి ఈ యాప్ ద్వారా ఈ అమ్మాయిలు ఇద్దరు కలిసి 2400 కోట్ల విలువైన పశువుల అమ్మకాలు చేశారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ లలో 80 లక్షల మంది రైతులు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. 160 కోట్ల రూపాయల ఫండ్స్ వీరికి ఏజెన్సీల నుంచి వచ్చాయి. ఉత్తర భారతదేశంలో ఈ ఆన్ లైన్ పశువుల సంత గొప్ప విప్లవం తీసుకువచ్చింది.

Leave a comment