కళాశ్రీ ఫౌండేషన్ ద్వారా బార్బీ బొమ్మలంత అందంగా ఉండే బొమ్మలను చేతితో తయారు చేస్తూ, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు రంజన్ బెన్ టైలరింగ్, బొమ్మల తయారీని సరదాగా నేర్చుకున్న రంజన్ బెన్. 1995లో దాన్ని వ్యాపారంగా మలిచారు. 8,000 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చారామె. ఒక్క బొమ్మ తయారీ కి 18 గంటలు పడుతుంది. ఇప్పుడు కళాశ్రీ ఫౌండేషన్ బొమ్మలకు 18 దేశాల్లో కస్టమర్లు ఉన్నారు. ప్రపంచానికి భారతీయ బొమ్మలను పరిచయం చేయాలనుకోన్నాము అంటారు రంజన్ బెన్.

Leave a comment