Categories
హిందీ టీవీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి హీనా ఖాన్ కెరీర్ లో దూసుకుపోతున్న తరుణంలో క్యాన్సర్ ఆమె పైన దాడి చేసింది హీనా ఖాన్ కీమోథెరపీ చేయించుకుంటూనే తన ఆరోగ్యం తో పాటు ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తోంది.ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన వీడియో లో ఊడిపోతున్న జుట్టు తో కనిపిస్తూ గొడుగు వేసుకోని చేతిలో ఫ్లాస్క్ పట్టుకొని జిమ్ లోకి వ్యాయామం చేసేందుకు వెళ్తున్న దృశ్యాలు నెటిజన్లకు స్ఫూర్తి ఇచ్చేలా ఉన్నాయి. కీమోథెరపీ దేహాన్ని పిండేస్తోంది అయినా వర్క్ వుట్స్ మానలేదు. అనారోగ్యం తో కుంగిపోవటం నాకు ఇష్టం లేదు. ఎప్పుడు లేచి నిలబడి మానసిక శక్తి తో ఉండటం నాకు ఇష్టం అంటుంది హీనా ఖాన్.