మెత్తగా పట్టుకుచ్చులా ఉండే జుట్టు సరయిన పోషకాలు అందకపోవటం వల్ల ,ఇంకా ఎన్నో ఇతర కారణాలతో పొడిబారి పోతాయి . స్టయిలింగ్ ఉత్పత్తులు స్ప్రేలు అతిగా వాడటం,బ్లో డ్రయర్ లు ,హాట్ కుంబ్స్ వంటి స్టయిలింగ్పరికరాలు వాడటం ,అతిగా తలస్నానం అధికమైన కెమికల్ ట్రీట్ మెంట్లు హెయిర్ కేర్ ఉత్పత్తులు ఎక్కువగా వాడటం వంటి వాటితో జుట్టుకు హాని కలుగుతుంది . ప్రభావ వంతమైన గృహ వైద్యం తో అందమైన శిరోజాలు సొంతం చేసుకోవచ్చు . జుట్టుకు అవకాడో గుజ్జు ,అరటి పండు గుజ్జు ,ఎగ్ మాస్క్ లు వంటివి ఎంతో మేలు చేస్తాయి . వీటిలో ఉండే విటమిన్లు కార్బోహైడ్రేట్స్,జంక్ ,ఐరన్  జుట్టు కుదుళ్ళకు మరమ్మతు చేసి వెంట్రుకల కండిషన్ మెరుగు పరుస్తాయి . ఎలాటి రసాయనాలున్నా ఉత్పత్తుల్ని వాడిన వారానికి ఒకసారి ఇలాటి ఫ్యాక్స్ వేస్తే జుట్టు బావుంటుంది .

Leave a comment