లిప్ స్టిక్ ఇప్పుడు అలవాటుగా వాడే సౌందర్య సాధనం అయిపోయింది . ఎన్నో వెరైటీలు,షేడ్స్ లో దొరికే ఈ లిప్ స్టిక్ తో ఇప్పటి ట్రెండ్ మూడ్ కలర్ ఛేంజింగ్ లిప్ స్టిక్ . ఇది మారె రంగుని బట్టి వేసుకొన్న వాళ్ళ మూడ్ తెలుస్తుందన్న మాట శరీరం ఉష్ణోగ్రత రసాయనాల్లోని హెచ్చు తగ్గుల కారణంగా పెదవుల పైన వేసుకొన్న రంగు లేత నుంచి ముదురు రంగులోకి మారిపోతుంది . ముత్యాలు, అలోవేరా ,విటమిన్-ఇ లతో తయారయ్యే ఈ రకం లిప్ స్టిక్ లు ఆరు షేడ్స్ లో దొరుకుతున్నాయి . వేసుకున్నాక ఆరుగంటల పాటు అలాగే ఉంటుంది . అలాగే మ్యాచింగ్ డ్రస్ లాగా మ్యాచింగ్ లాగా మారే లిప్ స్టిక్ చైనాలోని కెలీజుమై కాస్మొటిక్స్ కంపెనీ తయారు చేసింది . జెల్లీలాగా కనిపించే ఈ లిప్ స్టిక్ లోపల అందమైన పూలు కనిపిస్తాయి. కోకోహ్ బటర్ ఆలివ్ ,లావెండర్ వంటి సహజ తైలాలతో ఈ లిప్ స్టిక్ తయారు చేశారు .

Leave a comment