కొన్ని కథలు అద్భుతమైన స్ఫూర్తి ఇస్తాయి. Albrecht Durer గీసిన ప్రేయింగ్ హాండ్స్ చిత్రం ఆధారంగా అల్లిన కథ ఇది.ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం.పది మంది పిల్లలు ఉన్న కుటుంబంలో తండ్రి గంటలకొద్దీ కష్టపడి పిల్లలను పోషించేవాడు.వాళ్లలో ఇద్దరికీ చిత్రకారులు కావాలని ఆశ తండ్రి సంపాదనతో పిల్లలు ఆశ తీరే అవకాశం లేదు.ఆ ఇద్దరు పిల్లలు బాగా చర్చించుకొని వాళ్ళ లో ఒక్కడు కష్టపడి పని చేసే లాగా,ఇంకొకడు బొమ్మలు వేయడం నేర్చుకొనే లాగా. నాలుగేళ్ల తర్వాత బొమ్మలు వేసేవాడు తిరిగివచ్చి రెండో వాడికి అవకాశం ఇచ్చే లాగా మాట్లాడుకున్నారు ఒక పిల్లవాడు విద్యాలయానికి రెండోవాడు గనిలో పని చేసేందుకు వెళ్లారు.నాలుగేళ్ళు గడిచాయి బొమ్మలు వేయటం నేర్చుకొన్న వాడు ప్రపంచ ప్రఖ్యాతి గణించాడు.ఇంటికి తిరిగి వచ్చి గనిలో  ఉన్నవాడిని చదువుకోసం వెళ్ళమన్నాడు కానీ అప్పటికే గనిలో  ఉన్న వాడికి చేతులు, వేళ్ళు దెబ్బతిన్నాయి.అతను బొమ్మలు వేసే స్థితిలో లేడు చిత్రకారుడికి భరించలేనంత దుఃఖం కలిగింది.అతను అటు తర్వాత ఒక గొప్ప చిత్రం గీశాడు. అవి నమస్కరిస్తున్న చేతులు ఆ చిత్రం పేరు ప్రేయింగ్  హాండ్స్. ఇది కల్పితగాధే  Durer గీసిన చిత్రాన్ని చూసి అల్లిన  మళ్లీ నాకే ఇన్ స్పిరేషనల్ స్టోరీ.

Leave a comment