ఆర్కా మీడియా నిర్మిస్తున్న ‘స్వర్ణఖడ్గం’ అనే ఫాంటసీ టీవీ సీరియల్ లో పూనమ్ కౌర్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. కథ విజయేంద్ర ప్రసాద్. ఈ సీరియల్ లో అవకాశం నాకు చాలా రిలీఫ్ అంటోంది పూనమ్ కౌర్. తనకి సామాజిక సేవ అంటే చాలా అభిమానం ,జీవితంలో నాకు మా అమ్మే స్ఫూర్తి. చిన్నవయసులో నే నాన్న పోతే అమ్మే ముగ్గురు పిల్లల్ని పెంచి పోషించింది .ఆమె దైర్యమే నాకు వచ్చింది. ఎవరు ఎంత కిందకులాగాలని చూసినా తట్టుకొని నిలబడ్డ అమ్మే నాకు ఆదర్శం . ఈ సినీరంలో నా గురించి ఎలాంటి చెడ్డ వార్తలు రావని అమ్మకు మాటిచ్చాను. గాసిప్ లు, ఫేక్ న్యూస్ ల విషయంలో కొంత బాధేస్తుంది. నా వరకు నేను క్రమశిక్షణతో నిజాయితీగా పనిచేస్తాను అని చెపుతుంది పూనమ్ కౌర్.

Leave a comment