ఉద్యోగినుల సాధారణంగా ఎదుర్కునే సమస్యలు రెండే రెండు. ఒకటి నిద్ర సరిగా లేకపోవుటం  రెండవది మూత్ర సంబంధించిన ఇబ్బంది. ఇంటి పనుల ఆఫీస్ పనులతో నిరంతరం పరుగులు పెడుతూ వుంటారు. ఇటు ఇంటిచాకిరి అటు ఆఫీస్ బాధ్యతల కుదురుగా వుండనీయవు. ఈ  టెన్షన్ నిద్రలేమికి ముఖ్యకారణం మనసంతా తెల్లారి లేచి చేయవలిసిన పనుల చుట్టూ తిరగటం లో రాత్రి అలసిన శరీరం పడక చేరినా నిద్ర ఆమడ దూరంలో వుండిపోతుంది. అలాంటపుడు మంచి నిద్రకోసం సరైన రెసిపీ వుంది. కొద్దిగా కొత్తిమీర గ్రైండ్ చేసి జ్యూస్ తీసి దాన్ని వేడినీళ్ళతో కలిపి తాగితే ఎంతో ప్రయోజనం వుంటుంది. ఇక నిద్రా దేవి ఆహ్వానం పలుకుతుంది. ఇకపోతే పనిగంటలు సుదీర్ఘంగా ఉంటాయి కనుక మూత్రానికి వెళ్లేందుకు వాయిదా వేస్తారు. దీనివల్ల మొత్తం వ్యవస్థే దెబ్బ తింటుంది. యూరినల్ ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. ఎన్ని పనులున్నా మూత్రం బిగపట్టే ప్రయత్నాలు చేయద్దు. ఇది నేచర్ కాల్ . స్త్రీ పురుష బేధం ఇందులో ఉండదు. ఇది అందరి అవసరమే. కనుక ఎవరేమనుకుంటారో అన్న ఆలోచన వదిలేసి  అవసరం ఆయినప్పుడు  బాత్ రూమ్ కి వెళ్ళటం తప్పేమీ కాదు.

Leave a comment