ధ్యానం జీవితానికి మరింత విలువని  ప్రసాదిస్తోంది  అంటున్నారు  యోగా గురువులు . ధ్యానం అంటే  సమగ్రత ధ్యానం వల్ల మనసుకి ప్రశాంతత  లభిస్తుంది . ధ్యానంలో మనశరీరం స్థితిని  సంబంధించిన ఎరుక  మన  మనసుకు తెలుస్తుంది .  ఇది వృద్ధులకోసం కానేకాదు . అన్ని వయసుల వారికీ ముఖ్యంగా ఎంతో ఉత్సాహంలో ఎన్నెన్నో పనులు ఒకే సారి  చేయాలని ఆశపడే యువతకు  ఏకాగ్రత ఇస్తుంది . ఏ సమస్యనైనా  చిరునవ్వుతో ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం  పట్టుదల ఇస్తుంది  .ఎలాగంటే  ఐదు నిమిషాలు ఏకాగ్రతలో ఏదీ ఆలోచించకుండా  మనసుని  శూన్యంగా ఉంచుకోగలిగితే  అంతకు ముందు మనసులో ఏర్పడ్డ స్ట్రేస్‌ , ఆరాటం , కోపం , ఆతృత వంటి భావనలు మాయం అవుతాయి  అంటున్నారు యోగా గురువులు .

Leave a comment