గ్రీస్ రాజధాని ఏథేన్స్ లో యునెస్కో 51వ వరల్డ్ కాంగ్రెస్ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖ నృత్య కళాకారిణి అచ్యుత మానస . సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చదువుతూ కూచిపూడితో మాస్టర్స్ చేసింది మానస. ఆమె భరతనాట్యం,కథక్,మణిపూర్,ఒడిస్సా,మోహన నాట్యం,కూచిపూడి,టెంపుల్ రిబువల్ డాన్స్,సింహానందిని ఇలా అన్నీ రకాల నృత్యరీతుల్లోనూ ప్రతిభ సాధించింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల నుంచి వచ్చిన ఎంతో మంది నృత్య కళాకారులతో ఎథెన్స్ ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ డాన్స్ లో ప్రదర్శన ఇచ్చింది అచ్యుత మానస .ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న స్టేట్ హోమ్ చిల్ట్రన్స్ హోమ్ లో ఉండే పిల్లలకు నృత్యం నేర్పించటం తనకు చాలా ఇష్టమైన పని అంటోంది మానస.

Leave a comment